పేదలకు వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి మారిందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన 27 మంది వివిద ఆసుపత్రుల్లో చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయనిధికి అప్లై చేసుకున్న 27 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.10,97,000 ల విలువ చేసే చెక్కులను శివనగర్ లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అందజేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ… పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధితో ఎందరో పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సమైక్య పాలనలో పైరవీలు చేస్త తప్ప ముఖ్యమంత్రి సహాయనిధి డబ్బులు మంజూరయ్యేవి కావు..కానీ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయనిధి పారదర్శకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందజేస్తున్నారన్నారు. పేదలకి వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి మారిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement