Tuesday, November 19, 2024

WGL: పద్ధతి మార్చుకో… ఇదే ఫైనల్… జిల్లా కార్మిక శాఖ‌పై క‌లెక్ట‌ర్ ఫైర్

జనగామ, ఫిబ్రవరి 4(ప్రభ న్యూస్): జిల్లా కార్మిక శాఖ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పద్ధతి మార్చుకో ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ అంటూ కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జనగామ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా సిఐటియు పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ కార్మిక జిల్లా శాఖ అధికారిపై ఫిర్యాదు చేయడంతో అప్పటికి ప్రజావాణికి హాజరుకాని కార్మిక శాఖ జిల్లా అధికారి కుమారస్వామి ఆలస్యంగా రావడం జరిగింది.

దీంతో కలెక్టర్ జిల్లా కార్మిక శాఖ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. పద్ధతి మార్చుకో ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ అంటూ కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement