Tuesday, November 26, 2024

కేంద్ర, రాష్ట ప్ర‌భుత్వాలు పెంచిన ధ‌ర‌లు త‌గ్గించాలి : డా.రాంచంద్రునాయ‌క్‌

మ‌రిపెడ : అధిక ధ‌ర‌ల‌ నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ళ్లించేందుకే కేంద్ర, రాష్ట ప్ర‌భుత్వాలు దీక్ష‌ల పేరుతో నాట‌కాలాడుతున్నాయ‌ని, రైతుల మేలు ప‌ట్ల చిత్త శుద్ది ఉంటే రాష్టం ధాన్యం కొనాల‌ని, పెంచిన కరెంటు, గ్యాస్‌, చ‌మురు ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని కాంగ్రెస్ డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ డా.రాంచంద్రునాయ‌క్ డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మ‌రిపెడ మండ‌ల కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వ‌ద్ద‌ అధ్య‌క్షుడు పెండ్లి ర‌ఘువీరారెడ్డి ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన రైతు దీక్ష‌కు హాజ‌రై మాట్లాడారు. కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్టంలోని తెరాస పార్టీలు రెండు ఒకే కోవ‌కు చెందిన‌వ‌ని, అధికారం కోసం అమాయక రైతులను రోడ్డు మీద‌కు లాగుతున్నార‌న్నారు. ముందుగానే కేంద్రం పెట్టిన శ‌ర‌తులను ఒప్పుకుని కేసీఆర్ సంత‌కం పెట్టి, ఇప్పుడు ధాన్యం కోనాల‌ని రైతుల కోసం ఎమైనా చేస్తామ‌ని మాయ మాట‌లు చెబుతున్నార‌న్నారు. పాల‌న చేయాల్సిన ప్ర‌భుత్వాలే అటు డిల్లీలో ఇటు గ‌ల్లిలో ధ‌ర్నాలు, దీక్ష‌లు చేస్తే అధిక ధ‌ర‌లతో కుదేల‌వుతున్న ప్ర‌జ‌లు ఎవ‌రిని అడ‌గాల‌ని ప్ర‌శ్నించారు. పెరిగిన క‌రెంటు, గ్యాస్‌, చ‌మురు, నిత్య‌వ‌సారాలు వంటి వాటి ధ‌ర‌ల గురించి ప్ర‌జ‌లు ప్ర‌శ్నించ‌కుండా రాష్ట ప్ర‌జానికాన్ని అయోమ‌యానికి గురిచేస్తున్నార‌న్నారు. ప్ర‌జ‌ల కోసం పోరాడిన ఈటెల రాజేంద‌ర్ వ‌లె రెడ్యానాయ‌క్ కూడా డివిజ‌న్ రైతుల కోసం కేసీఆర్‌ను ప్ర‌శ్నించాల‌ని డిమాండ్ చేశారు. నియోజకవ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు ప‌ట్టం క‌డ‌తార‌న్నారు. కార్య‌క్ర‌మంలో మ‌రిపెడ ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు షేక్ తాజ్‌, ఐల‌మ‌ల్లు, ర‌వి, కమలాకర్, అజ్మీర శ్రీ‌ను, బ‌త్తుల శ్రీ‌నివాస్‌, ర‌మేష్‌, మ‌ల్లికంటి రాజు, కృష్ణ‌, బొల్లం న‌ర్స‌య్య‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement