Friday, November 22, 2024

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలది కీలక పాత్ర : సీఐ వేణుచందర్

భూపాలపల్లి (ప్రభ న్యూస్) : నేరాలు నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని చిట్యాల సీఐ వేణు చందర్ అన్నారు. ఆదివారం జయశంకర్ జిల్లా చిట్యాల మండలం అందుకు తండాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ను చిట్యాల సీఐ వేణు చందర్ చిట్యాల ఎస్ఐ గుర్రం కృష్ణ ప్రసాద్ , స్థానిక సర్పంచ్ భాస్కర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ సిద్ధంకి భాస్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సరిగా సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేని గ్రామంలో పోలీసుల సూచనతో ముందుకు వచ్చిన గ్రామస్థులు రూ.2లక్షల50 వేలతో గ్రామంలో సిసి 12 కెమెరాలు ఏర్పాటు చేయడం మిగతా గ్రామాలకు ఆదర్శనీయమని సహకరించిన గ్రామస్తులు, పాలకవర్గాన్ని వారు అభినందించారు . సీసీ కెమెరాలు గ్రామాల్లో ఉండటంవల్ల నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని , ఏదైనా నేరం జరిగినప్పుడు క్షణాల్లో నేరస్తులను పట్టుకోవడం సులువు అతుందన్నారు. ఒక్క కెమెరా ఉంటే 100 మంది పోలీసులు ఉన్నట్లే అన్నారు. గ్రామస్తులు కూడా సీసీ కెమెరాలను దృష్టిలో ఉంచుకొని సత్ప్రవర్తన తో మసులుకోవాలన్నారు. ద్వి చక్ర వాహన దారులు తప్పక హెల్మెట్ ధరించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి భూక్య సుజాత, ఉప సర్పంచ్ హట్కర్ రజిత, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement