Friday, November 22, 2024

ఒక్క సిసి కెమెరా వందమంది పోలీసులతో సమానం -వరంగల్ పోలీస్ కమిషనర్ పి.ప్రమోద్ కుమార్

జనగాం గ్రామీణ సర్కిల్ పోలీసుల పిలుపునందుకోని ప్రజల భాగస్వాయ్యంతో పాటు, నేను సైతంలో భాగంగా రఘునాథ్ పల్లి, లింగాల ఘన్ పూర్, గుండాల పోలీస్ స్టేషన్ల పరిధిలో నెల కోల్పబడిన 82 సి.సి కెమెరాలను(ఇందులో రఘునాథ పల్లిలో 50, లింగాల ఘన్ పూర్ 16 గుండాల పోలీస్ స్టేషన్ల పరిధిలో 16 ) రఘునాథ్ పల్లి నుండి పోలీస్ కమిషనర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో సి.సి కె.మెరాలు కీలకంగా నిలుస్తున్నాయి. సి.సి కెమెరాల ఎర్పాటుతో నేరాలను నియంత్రించడంతో పాటు , నేరానికి పాల్పడిన నేరస్థులను గుర్తించడం సులభమవుతుంది. అధే విధంగా సిసి కెమెరాల్లో నమోదయ్యే దృష్యాలు సాక్ష్యాలుగా నిలుస్తాయని తద్వారా నేరస్తుల నేరాలను కోర్టులో నిరూపించబడుతుందని. అధే విధంగా తమ వ్యక్తిగత భద్రత కోసం తమ ఇండ్ల ల్లో సి.సి కెమెరాలను ఎర్పాటు చేసుకోవడం శ్రేయస్సుకరమని. రాబోవు రోజుల ప్రజల భద్రత కోసం వరంగల్ కమిషనరేట్ పోలీసులు స్థానిక వ్యాపాస్థులతో కల్సి వరంగల్ సెక్యూరిటీ కౌన్సిల్ ను ఎర్పాటు చేయబడుతుందని.మహిళలకు భద్రత కల్పించడం కోసం వరంగల్ కమిషనరేట్ పోలీసులు తీసుకుంటున్న చర్యలతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల కట్టడి ముఖ్యంగా నేరాల నియంత్రించడంతో పాటు నేరస్తులను గుర్తించడం లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు చురుకు పనిచేస్తున్నారు. పోలీసులు తమ విధుల్లో మరింత రాణించాలంటే ప్రజల సహకారం అవసరం ఇందుకొసమని వరంగల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమ ములో వెస్ట్ జొన్ డి.సి.పి శ్రీనివాసరెడ్డి, ఘన్ పూర్ ఎ.సి.పి ట్రైనీ ఎ.పి.ఎస్ గైక్వాడ్ వైభర్ రఘునాథ్, జనగాం రూరల్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ బాలజీ వరప్రసాద్, ఎస్.ఐ రాజేష్ నాయక్, దేవేందర్, తిరుపతితో పాటు స్థానిక ప్రజలు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement