వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ పురపాలక సంఘం లో జరిగే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన కౌన్సిలర్‌లకు చుక్కెదురైంది. బి ఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానంను వ్యతిరేకిస్తున్నట్లు, ఛైర్ పర్సన్ రజనీ కిషన్ కు మద్దతుగా ఓటు వేయాలని విప్ జారీ చేసింది.
ఇది ఇలా ఉండగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్పర్సన్ రజనీ కిషన్ పై స్వంత పార్టీ సభ్యులే అవిశ్వాస తీర్మానం ఈ నెల 2న జిల్లా అధికారులకు ఇవ్వగా అవిశ్వాస పరీక్షకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అవిశ్వాస పరీక్షలో నెగ్గలంటే 17మంది సభ్యుల మద్దతు అవసరం.అయితే ఉన్న 18మందిలో 14మంది అవిశ్వాసానికి తెరలేపి ప్రయత్నాలు చేయగా మున్సిపల్ ఛైర్ పర్సన్ రజనీ కిషన్ ఇద్దరు కౌన్సిలర్ల తో కలిసి మైసూర్ క్యాంపుకు తరలి వెళ్ళారు.కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ అవిశ్వాస తీర్మానానికి ముందే నుండే దూరంగా ఉన్నారు. కాగా బిఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానంను వ్యతిరేకిస్తున్నట్లు విప్‌ను జారీ చేసింది.