Monday, November 25, 2024

WGL: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చేదు అనుభవం…సొంత పార్టీ సర్పంచ్ ఎదురు తిరిగిన వైనం

కమలాపూర్, జనవరి 31 (ప్రభ న్యూస్): హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ కి చెందిన సర్పంచ్ ఎమ్మెల్యేకు ఎదురు తిరిగి ఆయన జిపి భవనాన్ని ప్రారంభించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కానిపర్తి గ్రామపంచాయతీ భవనాన్ని నేడు ప్రారంభిస్తున్న తరుణంలో మంత్రులు హాజరు కావాల్సి ఉంది.

ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కాకపోవడంతో, గ్రామ సర్పంచ్ మాట్ల రవీందర్ ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి కూడా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే రాకముందే గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడంపై మండల వ్యాప్తంగా చర్చ జోరు అందుకుంది. కమలాపూర్ మండలంలోని ప్రజా ప్రతినిధులు కౌశిక్ రెడ్డికి తలనొప్పిగా తయారయ్యారని పలువురు చర్చిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement