హన్మకొండ : హన్మకొండ జిల్లా కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చింతగట్టు ప్రాంతం నుండి భీమారం వరకు ఉన్న రహదారి మీద ముగ్గురు యువకులు శుక్రవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై అతివేగంగా.. నిర్లక్ష్యంతో వికృత విన్యాసాలు చేస్తూ ఇతర వాహన దారులను చూసి అరుస్తూ, వారిని చూసి కామెంట్స్ చేస్తూ భయ బ్రాంతులకు గురి చేశారు. అంతేకాకుండా వచ్చి పోయే వాహన దారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వారు చేసిన తతంగం అంత ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది చూసిన పోలీస్ లు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సదరు యువకులను గుర్తించి వారిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారిలో రమేష్, వల్లపు విలాకర్, వల్లపు నాగరాజుగా గుర్తించి కేయూ పోలీస్ లు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వాహనానికి చలానా విధించారు. ఈ సందర్బంగా కేయూ ఇన్ స్పెక్టర్ దయాకర్ మాట్లాడుతూ.. యువత ఇటువంటి వికృత చేష్టలకు పాల్పడవద్దని, వీటి వలన రోడ్డు ప్రమాదాలు జరిగి చనిపోయే అవకాశం ఉందన్నారు. అంతేగాక వీరు చేసే చర్యలతో ఇతర వాహనదారులు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని తెలియజేశారు. అంతేగాక తల్లిదండ్రులు తమ పిల్లలు ఎటువంటి చెడు సావాసాలు చేయకుండా తమ పిల్లలని కనిపెట్టుకుని ఉండాలని హితవు పలికారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement