జనగామ క్రైమ్, ఫిబ్రవరి 22 ( ప్రభ న్యూస్) : జాతీయ రహదారుల్లో వాహనాల అతి వేగాన్ని అరికట్టేందుకు స్పీడ్ గన్ లను ఏర్పాటు చేసి ప్రతిఏటా కోట్లాది రూపాయల జరిమానాను ముక్కు పిండి వసూలు చేస్తున్న పోలీసులు జిల్లా కేంద్రంలో కొంత మంది పోకిరిలు బైక్ రేసింగ్ స్థాయిలో వాహనాలు నడుపుతున్న ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో కొంత మంది విద్యార్థులు, యువకులు లేటెస్ట్ బైక్ లతో రోడ్లపై విన్యాసాలు చేస్తూ వేగంగా పోటీ పడుతూ వెలుతుండటంతో పాదచారులు, ఇతర వాహనాల వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని పలువురు తెలిపారు. గతంలో ఇలాంటి సంఘటనలు శివారు ప్రాంతాల్లో జరుగగా కొంత మంది విద్యార్థులు, యువకులు మృత్యువాత పడిన సందర్బాలు ఉన్నాయి అని తెలిసింది. రోడ్ పై వేగంగా వెళుతూ ఒక్కసారిగా బ్రేక్ వేస్తే భారీ శబ్దాలు వచ్చేలా ఏర్పాటు చేయడంతో ప్రజలు జడుసుకుంటున్నారు. పోకిరీలు ప్రధాన రహదారులతో పాటు బస్ స్టాండ్ అవరణలో తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఇకనైనా పోలీసులు పోకిరీల బైక్ విన్యాసాలపై కటిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement