సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా భగత్ సింగ్ 90వ వర్దంతి వేడుకలు
హన్మకొండ : బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించిన షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల స్పూర్తితో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. హన్మకొండ బాలసముద్రం లోని సిపిఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ 90వ వర్ధంతిని సిపిఐ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి ఉరికొయ్యను ముద్దాడిన గొప్ప వీరుడు భగత్ సింగ్ అని కొనియాడారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి నియంతృత్వ పోకడలతో ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. కుల, మతాల మద్య చిచ్చు పెట్టి ప్రజలను విభజించి పాలిస్తూ అధికారమే పరమావధిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ పాలకులను గద్దె దించి భగత్ సింగ్ కలలు గన్న సమసమాజ నిర్మాణానానికి కంకణబద్దులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, జిల్లా నాయకులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, జూలియన్ సీజర్, దండు లక్ష్మణ్, సంగి ఎలేందర్, అరుణ, గుండె బద్రి తదితరులు పాల్గొన్నారు.
భగత్ సింగ్ స్పూర్తితో ఉద్యమిద్దాం..
Advertisement
తాజా వార్తలు
Advertisement