Tuesday, November 26, 2024

WGL: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు..
అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

చిట్యాల, ఆగస్టు 17 (ప్రభ న్యూస్) : వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల‌ పట్ల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. శనివారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. డాక్టర్లు, సిబ్బంది హాజరు రిజిస్టర్ లను పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు.

చిట్యాల టేకుమట్ల, మొగుళ్ళపల్లి, రేగొండ, మండలాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సిబ్బందితో ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు. వర్షాకాలం సీజన్ లో ప్రజలు విష జ్వరం బారిన పడుతున్న వారికి రక్త నమూనా పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో త‌హ‌సీల్దార్ హేమ ఎంపీ ఓ రామకృష్ణ, ఆర్ఐ రాజు, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, వైద్యులు శ్రీకాంత్, అఖిల, ప్రశాంతి, హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement