Saturday, November 2, 2024

WGL | హనుమకొండలో బీసీ కమిషన్ పర్యటన.. బహిరంగ విచారణ..

(ఆంధ్రప్రభ ప్రతినిధి హనుమకొండ) : స్థానిక సంస్థల రిజర్వేషన్ల దామాషాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా రాష్ట్ర బీసీ కమిషన్ హనుమకొండ చేరుకుంది. కమిషన్ చైర్మన్ జి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మీలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, బీసీ కుల సంఘాల నాయకులతో అభిప్రాయ సేకరణ చేపట్టారు.

ఉదయం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కమిషన్ సభ్యులు కలెక్టరేట్ లో అన్ని వర్గాలతో రిజర్వేషన్లపై అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. ఉదయం ములుగు జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ వరంగల్ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు కుల సంఘాల నాయకులతో అభిప్రాయ సేకరణ చేపట్టారు. మధ్యాహ్నం మహబూబాబాద్, జనగామ జిల్లాలకు చెందిన వారితో సమావేశం కానున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement