జనగామ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేత కేంద్రంతో వడ్లు కొనిస్తామని ప్రగల్బాలు పలికి ఇప్పుడు మాట మారుస్తున్నాడు.. బండి సంజయ్ కాదు..తొండి సంజయ్ అని, ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఎద్దేవా చేశారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ… రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేనితనంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద కక్ష కట్టిందన్నారు..బిజేపి ప్రభుత్వం యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చెయ్యమని చెపుతున్న దృష్ట్యా వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల11వ తేదీన తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన రాజధాని డిల్లీ నడిబొడ్డున ధర్నా చేయడం జరిగిందని ఈ సందర్బంగా గుర్తుచేశారు..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, కావున రైతులు ఎవ్వరూ ఆధైర్య పడవద్దని రైతులకు భరోసా కల్పించారు..ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందుల రేఖ, జడ్పిటిసి రవి, వైస్ ఎంపీపీ చల్లా సుధీర్ రెడ్డి, సర్పంచ్ చల్లా ఉమాదేవి, జిల్లా నాయకులు అక్కనపల్లి బాలరాజు, పిఎసిస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement