Wednesday, November 20, 2024

WGL : ఆక్ర‌మ‌ణ‌ల‌పై బ‌ల్దియా కొర‌డా… బెస్తం చెరువులో ఆక్రమణల తొలగింపు

వరంగల్ కార్పొరేషన్, జనవరి 31(ప్రభ న్యూస్): గ్రేటర్ వరంగల్లో ల్యాండ్ మాఫియా ఆక్రమణ లపై బల్దియా అధికారులు విరుచుకుపడుతున్నారు. గ్రేటర్ వరంగల్ కమిషనర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశానుసారము బుధవారం ఉదయం వరంగల్ నగరంలోని తిమ్మాపూర్ ఎక్స్ రోడ్‌లో గల బెస్తం చెరువులో వెలసిన అక్రమ కాంపౌండ్ వాళ్లను వరంగల్ మహానగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ బానోతు వెంకన్న నాయక్ ఆధ్వర్యంలో తొలగిస్తున్నారు.

బెస్తం చెరువులో నిర్మాణాలతో పాటు ఎఫ్టిఎల్ ప్రాంతంలో నిర్మించిన కాంపౌండ్ వాళ్లను నేలమట్టం చేస్తున్నారు. ఎఫ్ టి ఎల్ ప్రదేశంలో అనుమతులు రావని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణాలు చేయకూడదని సిటీ ప్లానర్ బాణత్ వెంకన్న హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఇరిగేషన్ సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement