Monday, November 25, 2024

WGL: అక్రమ నిర్మాణం పై బల్దియా కొరడా….

వరంగల్ కార్పొరేషన్, ఫిబ్రవరి 1(ప్రభ న్యూస్): హనుమకొండ నగరంలోని రెడ్డి కాలనీ లో యాదవ్ నగర్ పెట్రోల్ పంప్ వద్ద ఓ ప్రవేట్ స్థలంలో అక్రమంగా రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టిన కే విజయ రెడ్డి ఇంటిని గురు వారం బల్దియా అధికారులు తొలగించారు. బల్దియా కమిషనర్ రిజ్వాన్ భాష ఆదేశం మేరకు, సిటీ ప్లానర్ వెంకన్న నేతృత్వంలో రేకుల షెడ్డు ను తొలగించి నట్లు, ఎలాంటి ఆధారం లేకుండా ఓ ప్రైవేట్ స్థలంలో అక్రమ నిర్మాణము చేసినందుకు, స్థల యాజమానుల ఫిర్యాదు మేరకు తొలగించి నట్లు ఖాజీ పేట ఏసిపి ఖలీల్ అన్నారు.


ఈ ఘ‌ట‌న పై బాధితురాలు విజయ మాట్లాడుతూ ఇప్పటికే తాము ప్రజా భ‌వ‌న్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని, తనకు ఇందిరమ్మ పట్టా మంజూరు చేశారని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను, పోలీసులను ఆమె వేడుకొగా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా కూల్చి వేశారు. విజయ తో పాటు ఆమె కుమారుని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు ఖలీల్ ,శ్రీనివాసరెడ్డి, టి పి ఎస్ లు నరేందర్ ,శ్రీకాంత్ సుమన ,సంధ్యారాణి వెంకటరమణ ,రాజు నాయక్ కాజా షరీఫ్ , చైన్మెన్లు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement