కొడుకు తల్లిని రోకలిబండతో కొట్టి చంపిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా లెనిన్ నగర్ లో చోటుచేసుకుంది. కన్న తల్లిని కొడుకు రోకలి బండతో కొట్టి చంపాడు. కుటుంబ కలహాలతో భార్యభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. వాళ్లకు నచ్చజెప్పేందుకు వచ్చిన తల్లి కొమురమ్మపై కుమారుడు కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అడ్డు వచ్చిన తల్లిని రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. అనంతరం కృష్ణ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement