జనగామ : భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బి.అర్ అంబేద్కర్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పి చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయనతోపాటు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ శివ లింగయ్యలతో పూలమాల వేసి నివాళులు అర్పించారు..ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంపత్ రెడ్డి మాట్లాడుతూ… బాబా సాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడన్నారు.. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాల స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామని నినాదాలు చేశారు. అంబేద్కర్ పీడిత ప్రజలు తమ సమస్యలను, హక్కులను సాధించుకునేందుకు వారికి గొంతుక నిచ్చాడని పేర్కొన్నారు. ఎంతో దూరదృష్టితో, మేధో సంపత్తితో అంబేద్కర్ పేదలు, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేశారన్నారు. వారి సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. అంబేడ్కర్ విధానాలతోనే దళితులకు చట్టసభల్లో అవకాశం దక్కుతోందన్నారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం చేరువ చేయడానికి ఆయన అహర్నిశలు శ్రమించారని కొనియాడారు.
అంబేద్కర్ గొప్ప మహనీయుడు..జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
భారత రాజ్యాంగ నిర్మాత సాయి బాబా అంబేద్కర్ దేశంలో ఒక గొప్పమహానీయుడని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు..అంబేద్కర్ ఆశయాల కొనసాగింపునకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ క్రమంలోనే దళితుల పిల్లలకు విదేశీ విద్య, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రత్యేక గురుకులాలు తదితర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ కు నిజమైన నివాళి అర్పించడమంటే.. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడటమేనని తెలిపారు. అనంతరం అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివ లింగయ్య,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి క్రిష్ణ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జమున, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ-సిద్ధిలింగం, అదనపు కలెక్టర్ భాస్కర్, ఎస్స్సి కార్పొరేషన్ కొర్నలియస్, ఆర్డీఓ మధు మోహన్, సీఈఓ విజయలక్ష్మి, డిఆర్డి ఓ రాంరెడ్డి, డాక్టర్ సుగుణకర్ రాజు, దళిత సంఘాల నాయకులు బోట్ల శ్రీనివాస్, డా. రాజమొగిలి , తిరుమల రాజ్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు కన్నరాపు పరశురాములు, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ : జడ్పి చైర్మన్ సంపత్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement