Friday, November 22, 2024

ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన సీఎం కేసీఆర్ – వినోద్‌కుమార్‌

కరీమాబాద్‌, : ఆర్యవైశ్యులకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ సముచిత స్థానం కల్పించారని, దేశ, విదేశాలల్లో వ్యాపార రంగంలో అగ్రగ్రామిలో నిలిచినవారు ఆర్యవైశ్యులేనని ఇది జగమెరిగిన స త్య మని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన పల్లి వినోద్‌కుమార్‌అన్నారు. వరం గల్‌లోని సుశీల్‌ గార్డెన్‌లో మాజీ మేయర్‌ డా. గుండా ప్రకాష్‌రావు అధ్యక్షతన జిల్లా ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్యఅతిధిగా బోయినపల్లి వినోద్‌కుమార్‌, రాష్ట్ర హస్తకళల సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొల్లం సంపత్‌కుమార్‌, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, రాష్ట్ర మహిళా కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌, మాజీ ఎంపీ గుండు సుధారాణి, మాజీ జీహె చ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ను హాజరై నా రు. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి వినోద్‌ కు మార్‌ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు గతంలో ఏ ప్రభు త్వాలు ఇవ్వనటువంటి ప్రాముఖ్యతను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇచ్చారని, రాష్ట్ర ంలో ఒక ఎమ్మెల్సీ, ఒక మేయర్‌, నాలుగు కార్పొరేషన్‌ చైర్మన్‌ల పదవులను కేటాయించారన్నారు. అభివృద్ది వైపు ఆలోచించే వర్గం ఆర్యవైశ్యులేనని, అంతర్జాతీయ స్థా యిలో వర్తక, వాణిజ్యరంగాల్లో ఆరితేరినవారు ఆర్య వైశ్యులేనని గుర్తుచేశారు. ప్రస్తుతం వరంగల్‌ నగ రంలోని 66 డివిజన్లకుఎన్నికలకు జరుగుతున్నా య ని, డివిజన్లల్లోని తెరాస అభ్యర్ధులను గెలిపించాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ సమ్మే ళానికి హాజరైన 29వ డివిజన్‌ తెరాస అభ్యర్ది గుండు సుధారాణి, 22వ డివిజన్‌ అభ్యర్ది గందే కల్పన నవీన్‌లతో పాటు తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

సీఎం కేసిఆర్‌కు ఆర్యవైశ్యులు రుణపడిఉన్నారు..హస్తకళల సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొల్లం సంపత్‌కుమార్‌

సీఎం కేసిఆర్‌కు ఆర్యవైశ్యులు ఎంతో రుణపడి ఉన్నారని, గత ప్రభుత్వాలు ఏవి కూడా ఆర్యవైశ్యులకు ప్రాముఖ్యతను ఇవ్వలేదని హస్తకళల సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొల్లం సంపత్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసిఆర్‌ ఆర్య వైశ్యులకు ఎమ్మెల్సీ, మేయర్‌ పదవి, నాలుగు కార్పొ రేషన్ల చైర్న్మన్‌ల పదవులను కేటాయించి సముచిత స్థానం కల్పించాలని ఆయనకు ఆర్యవైశ్యులు ఎంతో రుణపడి ఉన్నారని ఈసమ్మేళనం ద్వారా సీఎం కేసి ఆర్‌కు ప్రత్యకే కృతజ్ఞతలు తెలుపుతూ, సీఎం కేసిఆర్‌, మంత్రి కేటిఆర్‌లు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిం చారు. ఈ సమ్మేళనంలో రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్‌, జిల్లా ఆర్య వైశ్యసంఘం అద్యక్షుడు రమేష్‌, తోటహరీష్‌, సంతొష్‌, మాజీ కార్పోరేటర్‌ గుండు అశ్రీతావిజయ్‌రాజ్‌, తొన్పునూరీ వీరన్న, ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement