ఖమ్మం – పేద, నిరుపేద, మధ్యతరగతి ఆర్యవైశ్యుల అభివృద్ధి, సంక్షేమం, వికాసం, వారి గౌరవప్రద జీవన మనుగడ కోసం వెంటనే ప్రకటించిన ఆర్యవైశ్య కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ కి ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి ప్రతినిదులు వినతిపత్రాన్ని అందజేశారు. 2018 లో శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ అభివృద్ధి ప్రదాత, అపర భగీరధుడు, ఉద్యమ రథసారథి, ఉద్యమాల వేగుచుక్క, సబ్బండ వర్ణాల సంక్షేమ పరిపాలకులు, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు టి.ఆర్.ఎస్ పార్టీ మేనిఫెస్టో చేర్చిన, ఆర్యవైశ్య కార్పొరేషన్ ను, వెయ్యి కోట్ల రూపాయల నిధులతో .పూర్తి చట్టబద్ధత భద్రత తో సత్వరమే ఏర్పాటు చేయాలని ఆ వినతిపత్రంలో కోరారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.. ఈ సందర్భంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన సమితి నాయకులు వెల్లంపల్లి వెంకట సుబ్బారావు, మిట్టపల్లి రవి మాట్లాడుతూ. … గతంలో కే.సీ.ఆర్ ప్రకటించిన ఆర్యవైశ్య కార్పొరేషన్ ను వెంటనే ఏర్పాటు చేసి
ఆర్యవైశ్యుల అభివృద్ధి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో కనికిచర్ల రజని , లక్ష్మణ నగేష్. కొల్లా రామారావు, కందిబండ బిక్షమయ్య, వేముల నరేష్ నాళ్ల భానుచందర్, కొంకిమళ్ల మృత్యుంజయరావు, వెంపటి రంగారావు, కొత్తా గణేష్ మాజీ పురపాలక సభ్యులు పెనుగొండ ఉపేందర్ దితరులు పాల్గొన్నారు
ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయండి – పువ్వాడ కు వినతి.
Advertisement
తాజా వార్తలు
Advertisement