Tuesday, November 19, 2024

మహిళలు అన్ని రంగాలలో సాధికారత సాధించాలి….ఎమ్మెల్యే అరూరి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని పర్వతగిరి జేఆర్ఆర్ గార్డెన్స్ మరియు వర్దన్నపేట లక్ష్మి గార్డెన్స్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన సంక్రాంతి సంబరాల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని మహిళా ప్రజా ప్రతినిధులను, అన్ని శాఖల మహిళా అధికారులను, సిబ్బందిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా శాలువాతో సన్మానించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ….. మహిళలు సమాజం లో పురుషులతో సమానంగా గౌరవించబడినప్పుడే సమాజం అన్నీ రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. మనకు వారసత్వంగా వచ్చిన పితృస్వామిక భావజాలం మూలంగా ఆడపిల్లలు, మహిళలు తీవ్రమైన వివక్షకు గురికబడుతున్నారని ఇది మన సమాజనికి మన బిడ్డల భావిషత్ కు ఎంత మాత్రం మంచిది కాదని తెలిపారు. పుట్టుక అనేది ఎవరు తమకు తాము నిర్ణయించుకునేది కాదు కాబట్టి స్త్రీ – పురుష వివక్ష అనేది ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. ఏ సమాజంలో అయితే స్త్రీలు గౌరవించబడతారో ఆ సమాజం నాగరికంగా అభివృద్ది చెందినట్లని పేర్కొన్నారు. స్త్రీలను, బాలికలను సమున్నతంగా గౌరవించి వారిని ఆదరించడం ప్రతి పురుషుడి యొక్క కనీస ధర్మమని తెలిపారు. స్త్రీలు, తమ కుటుంభాన్ని వదిలి, తమ ఆశయాలను వదిలి పురుషునికి, పిల్లలకు, కుటుంభానికి తమ సర్వస్వం దారపోసి కుటుంభాన్ని తమ బిడ్డల భావిషత్ ను తీర్చిదిద్దటం కొరకు ఎంతో త్యాగం చేస్తారని అటువంటి స్త్రీలను కించపర్చటం, అగౌరవపచడం మంచిది కాదని సూచించారు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్త్రీలు అన్నీ రంగాలలో ముందుండాలని వారికి సమాజంలో సమాన స్థానం, గౌరవం దొరకాలని గొప్ప ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసి చిత్తశుద్దితో అమలుపరిచి ఆడబిడ్డలలో ఆత్మ స్టైర్యాన్ని నింపుతున్నారని వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి శిష్యులుగా ప్రభుత్వంలో ఒక ముఖ్య పాత్రలో ఉన్న మేమందరం కూడా మహిళల అభివృద్దికి శాయశక్తుల కృషి చేస్తున్నామని తెలిపారు.

మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల సంరక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆడపిల్లలకు ప్రత్యేక గురుకులాలు, షీ టీంల ఏర్పాటు, స్థానిక సంస్థలలో 50శాతం రిజర్వేషన్, మహిళా సంఘాలకు 18వేల కోట్ల బ్యాంకు రుణాలు, స్త్రీ నిధి, వడ్డీ లేని రుణాలు, బతుకమ్మ చీరల పంపిణీ, సఖి సెంటర్ల ఏర్పాటు, మిషన్ భగీరథ వంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం ఆయా ప్రభుత్వ శాఖల ద్వారా అందిస్తూ నిత్యం మహిళల సంరక్షణ, అభివృద్ది, సమంత్వానికి ఎంతో కృషి చేస్తున్న విషయాన్ని మహిళలందరు అర్దం చేసుకుని ప్రభుత్వాన్ని నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు.

ప్రభుత్వం తరపున వస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా గడప గడపకు చేరుస్తున్న విషయం మీకు తెలుసని, అంతే గాకుండా మా నాన్న గారి పేరు మీద పెట్టిన ట్రస్ట్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేసి నా శక్తి మేరకు మీ రుణం తీర్చుకుంటున్నాని అన్నారు. అందులో భాగంగా సంక్రాంతి సంబరాల పేరుతో మహిళలకు పెట్టిన ఆటల పోటీలు, స్వయం సహాయక సంఘాల మహా సభలకు కూడా భజనం, వసతి ఏర్పాటు చేయడం, బ్యూటీ పార్లర్ ట్రెనింగ్ , హైదరబాద్ తీసుకువెళ్లి NIRD చూపించటం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.

అయినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉన్నది ఎందుకంటే, అభివృద్ది అనేది ఏ రోజు అయిపోదు. 8 సంవత్సరాలలో జరిగిన అభివృద్ది చూడండి , మీ ఎమ్మెల్యే మీకు నిత్యం అందుబాటు లో ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి చూడండి., ఎన్నికల వేల వచ్చే కొత్త బిచ్చగాళ్ల మాటలకు విజ్ఞులైన మహిళలు మోసపోవద్దు. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా నా కృషి కోన సాగుతూనే ఉంటది. కావాల్సింది మీ సహకారం, మీ ఆశీస్సులు మాత్రం ఉండాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల మహిళా అధికారులు, సిబ్బంది, మహిళలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement