Friday, November 22, 2024

అప్పు ఇచ్చినోడి ఇంటికే కన్నం.. ముగ్గురు అరెస్ట్..

వరంగల్ : తమ అవసరాలకు డబ్బు అప్పుగా ఇచ్చిన వ్యక్తి ఇంటిలోనే చోరీకి పాల్పడిన ముగ్గురు దొంగలను సీపీఎస్, మీ కాలనీ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్ట్ చేశారు. వీరి నుండి సుమారు మూడు లక్షల అరువై వేల రూపాయల విలువగల 65 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు అరకిలో వెండి, మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ వరంగల్ కరీమాబాద్ కు చెందిన ఉరుగొండ శ్రీకాంత్ (35), కాశీబుగ్గ ప్రాంతానికి దేవుల పల్లి రవీందర్ (40), కుడికాల్ల సురేష్ (36) వీరిలో శ్రీకాంత్ సెల్ ఫోన్ కంపెనీలో కలెక్షన్ బాయ్ గా పని చేస్తుండగా, మిగితా ఇద్దరు నిందితులు స్థానికంగా ఉందే ప్రింటింగ్ ప్రెస్ లో పని చేస్తారు. ఈ ముగ్గురు నిందితుల్లో శ్రీకాంత్, రవీందర్ ఇరువురు బావమరదులు కాగా మూడవ నిందితుడు సురేష్ ఈ ఇద్దరికి స్నేహితుడు. ఈ ముగ్గురు నిందితులు పనులను ముగించుకొని అనంతరం కల్సి మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారు. నిందితులు మీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానందకాలనీలో ఒంటరిగా నివాసం ఉంటున్న బాధితుడితో పరిచయం చేసుకున్నారు. నిందితులు మద్యం సేవించేందుకుగాను బాధితుడి వద్ద డబ్బులు అప్పుగా తీసుకోవడంతో పాటు తమతో పాటు బాధితుడికి అతని ఇంటిలోనే మద్యం తాగిస్తూ నిందితులు మద్యం సేవించేవారు. ఇదే క్రమంలో బాధితుడు నిందితులకు తన ఇంటిలోని బీరువా నుండి డబ్బు ఇచ్చే సమయంలో నిందితులకు బీరువాలోని బంగారు, వెండి వస్తువులపై కన్ను పడటంతో వాటిని చోరీ చేసి సులభంగా డబ్బు సంపాదించాలకున్నారు. ఇందులో భాగంగా నిందితులు ప్రణాళిక ప్రకారం బాధితుడుకి బయట ప్రదేశాల్లో మద్యం త్రాగించి మద్యం మత్తులో వున్న బాధితుడిని ఇంటికి తీసువచ్చి దించి పోయే క్రమంలో నిందితులు ఇంట్లో వున్న బీరువా తాళంచేవితో బీరువాలోని బంగారు, వెండి డబ్బును దఫాలవారిగా చోరీ చేసారు.

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అదనపు డిసిపి పుష్పా అదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించడం జరిగింది. ఈ రోజు ఉదయం నిందితులు ముగ్గురు చోరీ చేసిన సొత్తును వరంగల్ బిలియన్ మార్కెట్ లో అమ్మేందుకుగాను వెంకట్రామ టాకీస్ జంక్షన్ వద్ద ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో సిసిఎస్, మీల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా కల్సి వెళ్ళి నిందితులను ఆదుపులోని తీసుకోని తనీఖీ నిందితుల వద్ద చోరీ సొత్తును గుర్తించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా నిందితులు పాల్పడిన చోరీని పోలీసుల ముందు అంగీకరించారని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కంత్రీగాళ్ళను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్స్ అండ్ ఆపరెషన్స్ అదనపు డిసిపి పుప్పా, క్రైమ్స్ ఏసిపి డేవిడ్ రాజు, సిసిఎస్ ఇన్ స్పెక్టర్లు రమేష్ కుమార్, శ్రీనివాస్ రావు, మీ కాలనీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిసిఎస్ ఎస్.ఐ సంపత్ కుమార్, ఏఎన్ఏ శివకుమార్, హెడ్ కానిస్టేబుళ్ళు అంజయ్య,వేణుగోపాల్, షర్ఫుద్దీన్, జంపయ్య, కానిస్టేబుల్ నజీరుద్దీన్ పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమములో పరిపాలన విభాగం అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement