పరకాల, నడికుడ మండలాలలోని వివిధ గ్రామాల వ్యవసాయ బావుల వద్ద కొంత కాలంలో కరెంటు మోటారు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పరకాల పోలీసులు రంగంలోకి దిరి వలపన్ని మోటారు దొంగలను పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపురం గ్రామానికి చెందిన కేతిరి రాజు s/o సమ్మయ్య, కేతిరి లక్ష్మి విలాసాలకు డబ్బులు సరిపోవటం లేదని ఈ మోటార్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వీరి వద్ద నుండి 7 కరెంటు మోటార్లు, 25 కేజీ ల కాపర్ వైరు (వీటి మొత్తం విలువ 1,50,000) లను స్వాధీన పరచుకోవడం జరిగింది. ఈ ఇద్దరిలో కేతిరి లక్ష్మి ఇంతకుముందు దొంగతనం చేసిన అనుభవం ఉంది.. డబ్బు కోసమే దొంగతనాలు చేస్తున్నట్లు ఒప్పుకున్నట్లు పరకాల ఏసిపి శివరామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల సిఐ శ్రీ కిషన్, ఎస్ఐ ప్రశాంత్ బాబు, కానిస్టేబుల్ దేవేందర్, సుధాకర్, కృష్ణ, అశ్విని, హోం గార్డ్ సుధాకర్, హోంగార్డులు రామన్నలను అభినందించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement