Wednesday, November 20, 2024

నకిలీ సర్టిఫికెట్ల విక్రయాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

వరంగల్ : దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ ల నుండీ పరీక్షల్లో విధ్యార్థుల అవసరాలను అసరాగా చేసుకొని దేశంలోని వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన ఇంట‌ర్, డిగ్రీ, పీజి, బి.టెక్, చార్టెడ్ అకౌంటెంట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్లను విక్రయిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేయగా మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు. వీరి నుండి పోలీసులు వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన 153 నకిలీ సర్టిఫికేట్లు, 7 రబ్బరు స్టాంపులు, మూడు కంప్యూటర్లు, ఒక ల్యాప్ టాప్, మూడు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడిస్తూ…. పోలీసులు అరెస్టు చేసిన హన్మకొండ కి చెందిన నారెడ్ల రమేష్, దేవరాజు సుధాకర్, దాస బిక్షామయ్య అనే ముగ్గురు వేర్వేరుగా ఎడ్యుకేషనల్ అకాడమీలను ఏర్పాటు చేసి యువకుల అవసరాలను అసరాగా చేసుకోని ఎలాంటి పరీక్షలు రాయకుండానే దేశంలో వివిధ విశ్వవిధ్యాలయాలకు చెందిన యాజమాన్యంతో నిందితులు చేతులు కలిపి కావాల్సిన వారికి ఇంటర్, డిగ్రీ, పీజి, బి.టెక్, చార్టెడ్ అకౌంటెంట్ సంబంధించి నకిలీ ఉత్తీర్ణత సర్టిఫికెట్లను ఒక లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయలకు విధ్యార్థులకు అందజేసేవారు. నిందితులు విధ్యార్థుల అవసరాల నిమిత్తం అంతే కాకుండా దేశాల్లోని ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయాల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు వీలుగా మార్కుల మెమోలను సవరించి మార్కుల శాతాన్ని పెంచేవారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామన్నారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్ట‌ర్లు సంతోష్, శ్రీనివాస్ జీ, ఎస్సై లవన్ కుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుళ్లు రాజేష్, అలీ, బిక్షపతి, శ్రీను, రాజు, శ్రవణ్ కుమార్, హెూమ్ గార్డ్ విజయ్ లను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement