భూపాలపల్లి, ప్రభన్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గుడుంబా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని వరంగల్ అసిస్టెంట్ ఎక్సైజ్ కమీషనర్ నాగేందర్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల ఎక్సైజ్ అధికారులతో అసిస్టెంట్ కమీషనర్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తో కలిసి గుడుంబా నిర్మూలన పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడుంబా తయారుదారులు, అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
గుడుంబా తయారీకి వాడే ముడి పదార్థాలు అమ్మే వారిపై కఠినంగా వ్యవహరించాలని, పీడీ యాక్ట్ పెట్టాలని ఆయన అన్నారు. జిల్లాల్లో గుడుంబా తయారీ ప్రాంతాలను గుర్తించి, నిత్యం తనిఖీలు చేసి, నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. గుడుంబా నిర్మూలనపై ఈ సందర్భంగా అసిస్టెంట్ కమీషనర్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు, సూచనలు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..