హత్య చేసారని అనుమానం
కేసముద్రం, నవంబర్ 14(ఆంధ్రప్రభ): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అయితే ఆ వ్యక్తిని హత్య చేసి పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు ఇలా ఉన్నాయి… కేసముద్రం రైల్వే స్టేషన్ ఫస్ట్ ఫ్లాట్ ఫామ్ వైపు రైల్వే ఆవరణలోని టికెట్ కౌంటర్ మెట్లు ఎక్కుతున్న వైపు మొక్కలను పెంచే లాన్ పిట్ట గోడపై ఓ వ్యక్తి తల పగిలి తీవ్రగాయాలతో మృతిచెంది ఉన్నాడు. గుర్తు తెలియని వ్యక్తి మృతి అనుమానాస్పదంగా ఉండడంతో, అది హత్య చేసి కేసముద్రం రైల్వే స్టేషన్ ఆవరణలో పడేసి ఉంటారనే అనుమానం వ్యక్తం అవుతుంది. కాగా ఈ విషయమై స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
- Advertisement -