తొర్రూరు టౌన్, డిసెంబర్ 14 (ఆంధ్రప్రభ) : పట్టణంలోని పెద్ద చెరువులో వృద్దురాలు మృతిచెందిన సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన సంగ నర్సమ్మ (90) వృద్ధురాలు పట్టణంలోని తన కూతురు ఇంటి వద్ద ఉంటోంది.
కాగా తొర్రూరులో శుక్రవారం రాత్రి నుండి నరసమ్మ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తుండగా శనివారం ఉదయం తొర్రూరు పెద్ద చెరువులో నరసమ్మ మృతదేహం కనిపించిందన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు చెరువు వద్దకు వచ్చి పరిశీలించారు. వృద్దురాలి మృతికి కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
- Advertisement -