పోలీస్ స్టేషన్ లో దీక్ష చేపట్టిన ఐఏఎస్ ఆకునూరి మురళి
భూపాలపల్లి (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇండ్లు లేని నిరుపేదలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని మాజీ కలెక్టర్(ఐఏఎస్) ఆకునూరి మురళి కదం తొక్కారు. సోమవారం ఉదయం నిరుపేదలతో కలిసి భూపాలపల్లి వేశాలపల్లిలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ల వద్దకు తరలి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని భూపాలపల్లి స్టేషన్ కు తరలించారు. వారి వెంట సుమారు వంద మంది మహిళలు ఉన్నారు. 24 గంటల్లో డబుల్ రూమ్లు కేటాయించాలని, నిరుపేదలకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే ఉంటామన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా కట్టిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయని వెంటనే లబ్ధిదారులకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ ఇక్బాల్ ఫిబ్రవరి 10 లోగా అలాట్మెంట్ పూర్తి చేస్తామని సూచించినా వారు వినలేదు. 24 గంటల్లో నిరుపేదలకు అలాట్ మెంట్ పూర్తి చేయాలని అంతవరకు ఇక్కడ నుండి వెళ్లే లేదని స్టేషన్ లో భీష్మించుకుని కూర్చున్నారు.
డబుల్ బెడ్ రూమ్ కోసం కదం తొక్కిన మాజీ కలెక్టర్
Advertisement
తాజా వార్తలు
Advertisement