భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శనీయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. ముందుగా ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా కలెక్టర్ జెండా ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ చందుపట్ల కీర్తి రెడ్డి వేరువేరుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… ఆయన రాసిన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిందని, నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అని కొనియాడారు. బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకూడదనే ఉద్దేశంతో, వారికి కచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement