Friday, November 22, 2024

అంబేద్క‌ర్ వ్య‌క్తి కాదు.. భార‌త‌జాతికి శ‌క్తి: డోర్న‌క‌ల్ యువ‌నేత డీఎస్ ర‌విచంద్ర‌

మ‌రిపెడ : యావ‌త్ భార‌త ప్ర‌జ‌లకు అంబేద్క‌ర్ ఓ శ‌క్తి అని.. ఆయ‌న ర‌చించిన రాజ్యంగం వ‌ల్లే నేడు దేశంలో సార్వ‌భౌమ్యాధికారం కొన‌సాగుతుంద‌ని, జాతి వివ‌క్ష‌త‌ను రూపు మాపిన‌ బ‌డుగు బ‌ల‌హీనుల ఆశాజ్యోతి డా.బీఆర్.అంబేద్క‌ర్ అని డోర్న‌క‌ల్ యువ‌నేత, జిల్లా రైస్ మిల్ల‌ర్ల అసోషియేష‌న్ అధ్య‌క్షుడు ధ‌రంసోత్ ర‌వి చంద్ర అన్నారు. గురువారం ఆయ‌న మ‌రిపెడ మండ‌లంలోని య‌ల్లంపేట‌, తానంచ‌ర్ల గ్రామాల్లో జ‌రిగిన అంబేద్క‌ర్ 131వ‌ జ‌యంతి కార్య‌క్ర‌మాల్లో హాజ‌రై మాట్లాడారు. మహారాష్ట్రలో అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించిన మహనీయుడు సామాజిక విప్లవం కోసం జీవితాన్ని త్యాగం చేశారని ఆయన జయంతి జరుపుకోవడం కాదని, భావితరాలు ఆయన ఆశయ సాధన లో నడిచినప్పుడే నిజమైన ఘన నివాళి అన్నారు. అంబేద్కర్ అపర మేథావ‌ని, రాజ్యాంగ రూపకర్త అంటరాని తనం రూపు మాపిన సంఘ సంస్కర్త అని దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహానుభావుడన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణలో సీఎం పాలన కొనసాగిస్తున్నారని తెలుపారు. అంబేద్క‌ర్ రాసిన రాజ్యంగం వ‌ల్లే నేడు దేశంలో స‌మ సమాజ స్థాప‌న జ‌రిగింద‌న్నారు. ఆయ‌న రాసిన ఆర్టిక‌ల్ 3వ‌ల్లే తెలంగాణ ఏర్పాటు సుగ‌మం అయ్యింద‌న్నారు. జాతి వివ‌క్ష‌త‌ను రూపు మాపి, బడుగు బ‌ల‌హీన వ‌ర్గాలకు హ‌క్కులు క‌ల్పించాడ‌న్నారు. రాజ్యంగం ద్వారా పొందిన హ‌క్కుల ద్వారానే నేడు ఇంత పెద్ద దేశం ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ప్ర‌శాంతంగా న‌డుస్తోంద‌న్నారు. హక్కుల సాధన కోసం కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనలు ఆచరణలో పెట్టినప్పుడే వారికి ఘన నివాళి ఇచ్చినట్లు అన్నారు. ఆయ‌న వెంట మ‌రిపెడ జ‌డ్పీటీసీ తేజావత్ శారదా రవీందర్, తానంచర్ల సర్పంచ్ దిగజర్ల స్వేత ముఖేష్, మాజీ జ‌డ్పీటీసీ బాల్ని మాణిక్యం, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖా అధ్య‌క్షుడు సీతా వేంకన్న, పాదురి రాంచంద్రారెడ్డి, అనమాల రాంరెడ్డి, జల్ల శంభయ్య, మాజీ వ్య‌వ‌సాయ క‌మిటీ డైరెక్ట‌ర్ సీత వీర‌భద్రం, అంబేద్క‌ర్ యువ‌జ‌న యూత్ అధ్యక్షుడు పోలేపాక గణేష్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వీరభద్రమ్, గంగాధర్, వీక్లీ, సీత అంజీ, ద‌య్యాల విక్రం, షేక్ మ‌దార్‌, ప్రజాప్రతినిధులు గ్రామ స్థానిక నాయకులు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement