నర్సంపేట – రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో సిబ్బందికి శిక్షణ , ఈవిఎం ల పంపిణీ కార్యక్రమం అధికారులు చేపట్టారు.
ఈ సందర్భంగా ఏసిపి తిరుమల్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.మొత్తం 283 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అందులో 41సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు.3 కంపెనీల ప్రత్యేక బలగాలు చెన్నారావుపేట,నర్సంపేట,దుగ్గొండి మండలాలకు కేటాయించినట్లు తెలిపారు.800మంది సిబ్బందితో భద్రత ఏర్పాటు చేసినట్లు,ఇప్పటివరకు 1514మందిని వివిధ కారణాల రీత్యా బైండోవర్ చేసినట్లు తెలిపారు.
ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 3ఉండగా 6కు పెంచినట్లు,ఎస్సై తో ఒక టీమ్,సీఐ తో ఒక టీమ్,ఏసిపి తో ఒక టీమ్ ఏర్పాటు చేసినట్లు, 33రూట్లకు అధికారులను ఏర్పాటు చేసి తక్షణ నిర్ణయ అధికారాలను సైతం కల్పించినట్లు తెలిపారు.150పోలింగ్ కేంద్రాల లో వెబ్ కాస్టింగ్,62మంది మైక్రో అబ్జర్వర్లను,705 బ్యాలెట్ యూనిట్లను,396 వివి ప్యాట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏసిపి తిరుమల్ కోరారు.