Saturday, November 23, 2024

చేతులు ఎత్తడం ద్వారా మేయర్,ఉప మేయర్ ఎన్నిక:జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యా రాణి


● ఎన్నిక ప్రక్రియలో పాల్గొననున్న 66 మంది కార్పొరేటర్లు, 6 ఎక్స్ఆఫీసియో సభ్యులు….
● వివిధ పార్టీ సభ్యులకు ప్రత్యేక వరుసల సీటింగ్ ఏర్పాటు…
● కోవిడ్ బారిన పడిన కార్పొరేటర్ లకు వీడియో కాల్ ద్వారా పాల్గొనే అవకాశం…
వరంగల్ – చేతులు ఎత్తడం ద్వారా మేయర్,ఉప మేయర్ ఎన్నిక నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ సంధ్య రాణి తెలిపారు.గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో మేయర్,ఉపమేయర్ ఎన్నిక నిర్వహణపై సిబ్బంది కి అవగాహన కోసం ఏర్పాటు చేసిన సమావేశం లో అదనపు కలెక్టర్ పాల్గొని ఎన్నిక నిర్వహణ తీరును వివరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేయర్ ఎన్నిక చేతులెత్తడం ద్వారా జరుగుతుందని, ఇందుకోసం వరుసకు 6 మంది సభ్యుల చొప్పున 14 వరుసలలో సీటింగ్ ఏర్పాట్లు ఉంటాయని, ఎక్స్ ఆఫీసియో సభ్యులకు ప్రత్యేక వరుసలో సీటింగ్ ఏర్పాటు ఉంటుందని, ప్రతి వరుసకు ఒక రో ఆఫీసర్ ఉంటారని,చేతులెత్తే క్రమంలో వారు లెక్కిస్తారని,ప్రస్తుతం 66 వార్డ్ లకు ఎన్నికలు జరిగాయని,వారితో పాటు ఎక్స్ ఆఫీసియో సభ్యులు 6 గురు ఉన్నారని మొత్తం గా 72 మంది ఎన్నిక ప్రక్రియలో పాల్గొంటారని,ఆయా పార్టీల నుండి మేయర్ అభ్యర్థిని ఒకరు ప్రతిపాదిస్తారని,ఒకరు బలపరచాల్సి ఉంటుందని మేయర్ గా ఎన్నికయ్యే వ్యక్తి కి 36 కంటే ఎక్కువ మంది కార్పొరేటర్ ల మద్దతు అవసరం ఉంటుందని, ఆయా పార్టీల అభ్యర్థులకు సీటింగ్ ఏర్పాట్లు తెలుగు అక్షర ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేస్తామని,కోవిడ్ బారిన పడి “గృహ ఏకాంతం” (హోమ్ ఐసోలేషన్)లో ఉన్న కార్పొరేటర్లు 8 మంది ఉన్నారని,వారు కూడా ఎన్నిక లో పాల్గొనడానికి వీలుగా వారి వద్దకు బల్దియా సిబ్బంది పి.పి.ఈ. కిట్లు ధరించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్నిక సమయానికి వారికి అందుబాటులో ఉంటూ వీడియో కాల్ ద్వారా మద్దతు తెలియజేయడం నకు సహకరిస్తారని,అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వారు ఇచ్చే మద్దతును ప్రత్యక్షం గా అందరూ వీక్షించేలా ఎన్నిక ప్రాంతం లో ప్రత్యేకం గా టెలివిజన్ ఏర్పాటు చేస్తున్నామని మధ్యాహ్నం 3 గం.లకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ఓథ్(ప్రతిజ్ఞ) అనంతరం, 3:30కి మేయర్ ఎన్నిక ఉంటుందని, నిష్పక్షపాతం గా ఎన్నిక జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు, ఎలాంటి వివాదాలకు తావులేకుండా సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో బల్దియా ఇంచార్జి కమీషనర్ సత్యనారాయణ,సెక్రటరీ విజయ లక్ష్మి,ఉప కమీషనర్ రవీందర్ యాదవ్,పర్యవేక్షకులు జాకీర్ హుస్సేన్,ఆర్.ఓ.షెహజాది బేగం,సానిటరీ సూపర్ వైజర్ నరేంధర్,ఎస్.ఐ. శ్యామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.గ

Advertisement

తాజా వార్తలు

Advertisement