Sunday, November 17, 2024

TS : నీటి సరఫరా లో ఇబ్బందులు లేకుండా చర్యలు…. బల్దియా కమిషనర్ అశ్విని

నీటి సరఫరా లో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ధర్మసాగర్ రిజర్వాయర్ తో పాటు వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ను కమీషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి నీటి సరఫరా తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ధర్మసాగర్ ఇంటెక్ వెల్ ను పరిశీలించిన కమీషనర్ రిజర్వాయర్ నుండి బల్దియా పరిధిలోని మూడు ఫిల్టర్ బెడ్ లకు నీరు చేరే విధానం తో పాటు స్థానికం గా ఉన్న ల్యాబ్ లో నీటి నాణ్యత నిర్ధారణ విధానాన్ని, క్లోరినేషన్ ప్రక్రియ తో పాటు నిర్వహించు రిజిస్టర్ వివరాలను సిబ్బందిని కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమం లో దేవాదుల నుండి ఎల్ ఎం డి నుండి రిజర్వాయర్ లోకి నీరు చేరే ప్రక్రియను అధికారులు కమీషనర్ కు వివరించారు.

మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడిన కమీషనర్ గత 5 సం.ల నుండి నీటి సరఫరా లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని అడిగి తెలుసుకొని వేసవి లో నీటి ఎద్దడి తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి సరఫరా విధానాలకు సంబందించి బల్దియా తరపున ఎలాంటి సహకారం అవసరం ఉన్న తమ దృష్టికి తేవాలని అన్నారు. అనంతరం వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ను సందర్శించి నిర్వహిస్తున్న నీటి శుద్దీకరణ ప్రక్రియను అధికారులను అడిగి తెలుసుకొని ఫ్లో మీటర్ పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ లు రాజయ్య బిఎల్ శ్రీనివాస రావు డీఈలు సంతోష్ అజ్మీరా శ్రీకాంత్, మిషన్ భగీరథ డి ఈ జీవన్, ఎ ఈ ఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement