Friday, September 6, 2024

WGL: ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి… మేయర్

వరంగల్ : వరంగల్ మహా నగర పాలక సంస్ధ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తో కలిసి మేయర్ గుండు సుధారాణి సోమవారం క్షేత్రస్థాయిలో బొంది వాగు నాలా, 12 మోరీలు, పోతన నగర్ సబ్ స్టేషన్ ప్రాంతంలో గల నాలా ప్రాంతం భద్రకాళి ఆలయంకు వెళ్ళే ప్రాంతంలో గల నాలా ప్రవాహ తీరు కాపు వాడ వైపు గల భద్రకాళి మత్తడి పెద్దమ్మ గడ్డ వద్దగల నాలా ప్రాంతం, చిన్న వడ్డేపల్లి చెరువు ప్రాంతాల్లో నీటి నిల్వ స్థితిగతులను పరిశీలించి వర్షాభావ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి తగు సూచనలు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ బానోతు వెంకన్న, ఎస్ఈలు కృష్ణ రావు, ప్రవీణ్ చంద్ర, సీఎం ఎచ్ ఓ డా.రాజేష్, చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్, ఈఈలు రాజయ్య, సంజయ్ కుమార్, సిబ్బంది పాల్గోన్నారు. ఎస్ఈ లు ప్రవీణ్ చంద్ర కృష్ణా రావు సిఎంహెచ్ఓ డా.రాజేష్ సిటీ ప్లానర్ వెంకన్న డీఎఫ్ఓ శంకర్ లింగం, ఈఈ లు రాజయ్య, శ్రీనివాస్, డీఈ లు రవికుమార్, రవికిరణ్, రంగారావు, ఏఈ లు హారికుమార్, కార్తీక్, సతీష్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement