జనగామ : గుంటల భూమి పేరుతో ఆక్రమించుకుంటున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరారు. జనగామ జిల్లా జెడ్పీ సమావేశంలో మేకలగట్టు దళితుల ఫార్మ్ హౌస్ పేరుతో వందల ఎకరాల భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతులు మారుతున్నాయని, రెవెన్యూ అధికారులు గుంటల భూమి పేరుతో ఆక్రమణపై అధికారుల నిర్లక్ష్యం జరుగుతుందని.. ఈ విషయంపై ఎమ్మెల్యే రాజయ్య ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ప్రభుత్వం స్పందించాలని రఘునాథ్ పల్లి ఎంపీపీ మేకల వరలక్ష్మి, టి పి టి సి బొల్లం అజయ్ కుమార్, లింగాల గణపురం జడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి, గణపురం ఎంపీపీ జయశ్రీ , పాలకుర్తి జెడ్ పి టి సి శ్రీనివాస్, జఫర్గడ్ జెడ్పిటిసి ఇల్లెందుల బేబీ లు వెంటనే భూములపై అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో జెడ్పి చైర్మన్ పగల సంపత్ రెడ్డి స్పందిస్తూ… ఆ భూములపై వెంటనే సంబంధిత అధికారులు పర్యవేక్షించి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement