Thursday, November 21, 2024

WGL | అప్పుల బాధ తాళలేక ఉపాధ్యాయుడు ఆత్మహత్య

వాజేడు, నవంబర్ 21 (ఆంధ్రప్రభ) : అప్పుల బాధ తాళలేక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో గురువారం జరిగింది. వాజేడు ఎస్సై రుద్రారపు హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కోయవీరాపురం గ్రామానికి చెందిన చాప బుచ్చయ్య (55) పెద్ద గొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నాడు.

ఆ వ్యక్తి అప్పుల బాధతో గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని ఒక చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసిన గ్రామస్తులు అతడిని ఏటూరునాగారం ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపు చనిపోయినట్లు అతని భార్య రమణ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement