వర్ధన్నపేట, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని గడపగడపకు సంక్షేమ పథకాలను పంపిణీ చేసే ప్రజా నాయకుడు అరూరి రమేష్ పదిలంగ ఉండాలని మంగళవారం ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆసుపత్రులలో రోగులకు పండ్ల పంపిణీ వంటి కార్యక్రమాలను చేపట్టి సంబరాలు జరుపుకున్నారు. భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దర్శించుకున్న అనంతరం ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి దేవాలయ అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. దేవాలయ ఆవరణంలో ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా మొక్కను నాటి, పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే అరూరిని గజమాలతో సన్మానించి, పూల బొకేలు అందించి శాలువాలతో సత్కరించారు. ప్రభుత్వం తరఫున ప్రజలకు అందించాల్సిన ఆర్థిక, అభివృద్ధి, సంక్షేమ పథకాలను జాతీయం చేయకుండా ప్రజలకు అందించేందుకు నిరంతరం అలుపెరుగని ప్రయత్నం చేస్తూ ప్రజల మన్ననలు పొందిన ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు, ఎంపిపి శ్రీమతి మార్నేని మధుమతి రవిందర్ రావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ, వైస్ ఎంపిపి తంపుల మోహన్, దర్గా సొసైటీ వైస్ చైర్మన్ మాదాసు బాబు, దేవస్థానం మాజీ చైర్మన్ మునిగాల సమ్మయ్య, మండలపార్టీ అధ్యక్షులు పోలేపల్లి శంకర్ రెడ్డి, పార్టీ ప్రధానకార్యదర్శి బుర్ర రాజశేఖర్, నియోజకవర్గ అధికార ప్రతినిధి మిద్దెపాక రవీందర్, మండల కో ఆప్షన్ సభ్యులు గుంశావలి, ఆత్మ డైరెక్టర్లు దేవేందర్, కట్కూరి రాజు, మండల మహిళా అధ్యక్షురాలు దేవికారెడ్డి, ప్రచార కార్యదర్శి కోమలత, మండల యూత్ అధ్యక్షులు మరుపట్ల నరేష్, మండల ఎస్సి సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, రైతు విభాగం, మైనార్టీ అధ్యక్షులు దుప్పెల్లి కొమురయ్య, పల్లంకొండ సురేష్, విజయ్ భాస్కర్, రాఘవులు, అబ్బాస్ అలీ, సర్పంచుల పోరం అధ్యక్షులు కత్తి దేవేందర్, స్ధానిక సర్పంచ్ జన్ను కుమార స్వామి, ఎంపీటీసీలు కల్పన మధుకర్, కద్దూరి రాజు, తాటికాయల రమేష్, ఉపసర్పంచ్ సతీష్, గ్రామ పార్టీ అధ్యక్షులు పరమేష్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు, సొసైటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement