Saturday, November 23, 2024

కుక్కల దాడిలో 20 గొర్రెలు మృతి

జనగామ : గొర్రెల మందపైన గురువారం ఉదయం 8.30 గంటలకు కుక్కలు దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందగా, 10గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.. ఈఘటన జనగామ జిల్లా గానుగుపహాడ్ గ్రామంలో జరిగింది. భాదితుడు తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి.. గానుగుపహాడ్ గ్రామానికి చెందిన రేసు వెంకటయ్య జీవానోపాధి కోసం గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగా గొర్రెలను పాకలోకి పంపి భోజనం కోసం ఇంటికి వెళ్ళాడు. తిరిగి వచ్చేలోపు గొర్రెల పాకలో ఉన్న 30 గొర్ల మందపైన 8కుక్కలు దాడిచేసాయి. దీంతో 20గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాగా, 10గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయని బాధిత రైతు వెంకటయ్య వాపోయాడు. గొర్రెలతో రోజువారీ జీవనం సాగిస్తున్న వెంకటయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని గానుగుపహాడ్ శ్రీ మల్లిఖార్జున యువజన, యాదవ సంఘం నాయకులు కోరుతున్నారు.
బాధిత రైతును పరామర్శించిన జిఎంపియస్ నాయకులు :
విషయం తెలుసుకున్న జిఎంపియస్ నాయకులు సంఘటన స్థలానికి చేరుకొని బాధిత రైతు రేసు వెంకటయ్యను పరామర్శించారు. జిఎంపియస్ జిల్లా సహాయ కార్యదర్శి కన్నెబోయిన బాలరాజు, గ్రామ సర్పంచ్ సానబోయిన శ్రీనివాస్, ఎంపీటీసీ రెడ్డబోయిన పద్మ బాలస్వామి, ఉపసర్పంచ్ రెడబోయిన రవీందర్, రైతు సమితి కోఆర్డినేటర్ కూకట్ల రాములు, కన్నెబోయిన బుగ్గయ్య రమేష్, చంద్రయ్య, గట్టయ్య, జగన్, ఐలయ్య, సోసైటీ మాజీ అధ్యక్షుల సత్యనారాయణ, కడకంటి కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement