Friday, November 22, 2024

సావిత్రిబాయి పూలే జాతీయ అవార్డు అందుకున్న కంకల రజిత

భూపాలపల్లి టౌన్, భారతీయ దళిత సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ అధ్యక్షులు డాక్టర్ సుమనాక్షర్, ప్రధాన కార్యదర్శి జై సుమనాక్షర్ చేతుల మీదుగా సావిత్రిబాయి పూలే నేషనల్ అవార్డు-2020 ను పట్టణ కేంద్రానికి చెందిన హెచ్ఎంఆర్డీఎస్ స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలు కంకల రజిత సోమవారం న్యూ ఢిల్లీ లో అందుకున్నారు. హెలెన్ మేయర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అను స్వచ్చంద సంస్థను 2004 సంవత్సరంలో స్థాపించి వివిధ రకాల దివ్యాంగులకు పాఠశాల ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు, కరోనా లాక్ డౌన్ సమయంలో 60 రోజుల పాటు 1500 నిరుపేద, వలస కార్మికుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించినందుకు గాను ఈ అవార్డుకు కంకల రజితను ఎంపిక చేసినట్లు భారతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ ప్రెసిడెంట్ డాక్టర్ జితేందర్ మను తెలిపారు. తన సేవలను గుర్తించి జాతీయ స్థాయి అవార్డు ఇచ్చినందుకు రజిత ఈ సందర్బంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎంఆర్డీఎస్ నిర్వాహకులు కంకల రాజయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement