Tuesday, November 26, 2024

వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీరు

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తో అస్తవ్యస్తం
నీటి కోసం ప్రజలు ఎదురుచూపులు

ములుగు – రాష్ట్రంలో ప్రజలకు ఏర్పడుతున్న త్రాగు నీటి సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం ను ప్రారంబించింది దిని ద్వారా ప్రతి ఇంటి కి మంచినీటిని సరఫరా చేసేందుకు పథకాన్ని అమలు పరుస్తోంది కానీ ప్రస్తుతం పైప్ లైన్ పలిగి నీరు వృధాగా పోతున్నా పట్టించుకునే వారే లేరు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి ఇంటి కి మంచినీటిని సరఫరా చేసేందుకు పథకాన్ని ప్రవేశ పెడితే అధికారుల అండతో కాంట్రాక్టర్స్ తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కరని ప్రజలు గుస గుస లాడుతున్నాయి వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా కేంద్రంలో అధికార యంత్రాంగం నిత్యం మెలిగే రహదారిలో నే నీరు వృధాగా పోతున్నా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు గత మూడు నెలలుగా మిషన్ భగీరథ పైప్ లైన్ పలిగీ నీరు వృధాగా పోతున్నా చూసి చూడనట్లుగా వ్యవహరించడంలో లో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు ఒక దిక్కు నీరు లేక ప్రజలు విలవిలలాడుతూ ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు పైప్ లైన్ పలిగి ఇన్ని రోజులైనా సంబంధిత అధికారులు గాని కాంట్రాక్టర్ గాని పట్టించుకోకపోవడంతో నీరు వృధాగా పోతుందని, ఇదంతా అధికారుల కనుసైగ లోనే జరుగుతుందని లేకపోతే ఇప్పటికే కాంట్రాక్టర్ పైపులైను మరమ్మతులు చేసి నీరు అందించే వారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement