ములుగు జిల్లా కోసం ముందుండి పాటుపడిన వ్యక్తి పల్లా
చివరి ఓటు వరకు పల్లాకు నమోదయ్యేలా చూడాలి – మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు: ప్రశ్నించే పరిష్కరించే గొంతుక ఒక్కటేనని అది పల్లా రాజేశ్వర్ రెడ్డినేనని తెలంగాణ రాష్ట్ర స్ర్తీ శిశు సంక్షేమ మరియు గిరిజనాభివృద్ది శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగులోని డిఎల్ఆర్ వేడుకల మందిరంలో ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల దిశా నిర్దేశ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ములుగు జిల్లా కోసం ముందుండి జిల్లా ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి జిల్లా ప్రజల ఆకాంక్షను సహాకారం చేయడంలో ముందున్న వ్యక్తి పల్లా అన్న విషయాన్ని ప్రజలకు, ఓటర్లకు అర్థమయ్యేలా వ్యవహరించాలన్నారు. నియోజక వర్గంలో చిట్ట చివరి ఓటును కూడా టిఆర్ఎస్ పార్టీకే ఒడిసి పట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినన్ని సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడ లేవని, మన రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను అందాయని ఆమె అన్నారు. ఎన్నికల ప్రచారం, ఓటింగ్ రోజున ఓటర్ల విషయంలో తీసుకోవాల్సిన మెలుకువల గురించి ఆమె ములుగు నియోజక వర్గంలోని కార్యకర్తలందరికి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజక వర్గ కోఆర్డినేటర్ గోవింద్ నాయక్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జీ మెట్టు శ్రీనివాస్, మాజీ ఎంపి సీతరాం నాయక్, ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, మండలాల అధ్యక్షుడు బాదం ప్రవీణ్,కూరెల్ల రామాచారి, బిక్షపతి, బండారి చంద్రయ్య, సునిల్, లక్ష్మీ నారాయణ, ములుగు వెంకటాపూర్ జడ్పీటిసిలు సకినాల భవాని, గై రుద్రమదేవిలు ,శ్రీధర్ వర్మ , మంద రవి, రవిరామన్, విజయ్ రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నించే పరిష్కరించే గొంతుక ఒక్కటే
Advertisement
తాజా వార్తలు
Advertisement