Friday, November 22, 2024

ప్రపంచానికే భారత దేశ మహిళలు ఆదర్శం.

జ‌నగామ. భారత దేశ మహిళలు వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి చేరుకొని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని జనగామ ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇమ్మడి శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్, ఎన్ ఎస్ ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ యావత్ భారతదేశం మన మహిళల ప్రతిభాపాటవాలు పై అపార నమ్మకాన్ని పెట్టుకున్నారాన్నరు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ న్యాయవాది కె సునీత రెడ్డి మాట్లాడుతూ మహిళలు శక్తివంతులు అయితే ఆ కుటుంబమే కాకుండా దేశం మొత్తం కూడా అభివృద్ధివైపు ఫైనల్స్ ఉందన్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పటిష్టమైన ప్రణాళిక నిరంతర శ్రమ పట్టుదలతో ముందుకు సాగాలని కోరారు . చిన్న చిన్న సమస్యలతో చదువులకు దూరం కావద్దు అన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే శ్రీనివాస్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కన్వీనర్ డాక్టర్ జె ఉమా రాణి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అన్నపూర్ణ, ఐ సి సి కన్వీనర్ సంధ్యారాణి, అధ్యాపకులు కల్పన మహేశ్వరి, ఆండాలు, రమేష్ కుమార్ , ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమ అధికారులు సీతారాములు,విజయ, భాస్కర్ రెడ్డి ,చిన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement