Friday, November 22, 2024

జనగామ జిల్లాలో మొక్కల మనుగడ వంద శాతం ఉండాలి – జిల్లా కలెక్టర్ కె. నిఖిల

జనగామ… హరితహారం కార్యక్రమం క్రింద నాటిన మొక్కల మనుగడ వంద శాతం ఉండాలని, ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. నిఖిల అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో నర్సరీలు, వైకుంఠదామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, రైతు కల్లాలు, లేబర్ టర్నోవర్, పన్ను వసూళ్లు, పారిశుద్ధ్యం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె నిఖిల మాట్లాడుతూ, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, ఎంపీవోలు తమ తమ పరిధిలోని నర్సరీలు సందర్శించి, విత్తనాలు మొలకెత్తుట, స్క్రోటింగ్ పై నివేదిక సమర్పించాలని, ఏ నర్సరీలోని 75 శాతానికి తక్కువ ఉన్నచో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాచర్ లతో వారు ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ రోజుల్లో మొక్కలకు నీరు పెట్టాలో కార్యాచరణ చేయాలని, వాచ్ అండ్ వార్డ్ చెల్లింపుల కొరకు ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని అన్నారు. అవాసాల్లో వంద శాతం పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు పూర్తి చేయాలని, ప్రతి పల్లె ప్రకృతి వనాలకు అంచనాలు వంద శాతం పూర్తి చేయాలని అన్నారు. పల్లె ప్రకృతి వనానికి ప్రతి రోజు నీరు పట్టాలని, పచ్చగా, ఆకర్షణీయంగా కనిపించాలని అన్నారు. ఉపాధి హామీ లేబర్ టర్నోవర్ పెంచాలని, ప్రతి గ్రామంలో కనీసం 50 మంది కూలీలను సమీకరించాలని అన్నారు. లేబర్ ఎఫ్టివోలు ఏ రోజుకారోజు అప్లోడ్ చేయాలన్నారు. వైకుంఠదామాల మిగులు పనులు వెంటనే పూర్తి చేసి, ఎఫ్టివోలు అప్లోడ్ చేయాలన్నారు. మిగులు పనుల పురోగతి ఫోటోగ్రాఫ్ లు ప్రతి రోజు వాట్సాప్ గ్రూప్ లో పెట్టాలన్నారు. వైకుంఠ దామాలకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా విషయమై, ఎన్ని చోట్ల పనులు పూర్తయింది, ఇంకా ఎన్ని చోట్ల పూర్తి కావాల్సి ఉంది, పూర్తికి ఏమైనా సమస్యలు ఉన్నది మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడిఓలు, ఎంపీవోలు తనిఖీలు చేసి నివేదిక సమర్పించాలన్నారు. సెగ్రిగేషన్ షెడ్లు వంద శాతం ఉపయోగంలోకి తేవాలని, తడి, పొడి చెత్త విభజన పక్కాగా జరగాలని అన్నారు. జిల్లాలో 607 రైతు కల్లాల నిర్మాణాలు పూర్తి అయినట్లు, పూర్తయిన వాటి ఎఫ్టివోలు అప్లోడ్ చేసి, హార్డ్ కాపీలు సిద్ధంగా ఉంచాలన్నారు. వంద శాతం పన్నుల వసూలుకు ప్రణాళికాబద్ద చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. మిగులు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేయాలని, ఒక టీమ్ ఏర్పాటుచేసి, మంజూరైన వాటిలో ఏమైనా రద్దు చేయాల్సినవి ఉంటే రద్దు చేయడం, ప్రతిపాదనలు మంజూరు చేయడం వెంటనే చేపట్టాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పక్కాగా నిర్వహించాలని, ప్రతిరోజూ పారిశుద్ధ్య నివేదిక సమర్పించాలని అన్నారు. మండలం, గ్రామాల వారీగా పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై అధికారులు వ్యక్తిగత శ్రద్ధ వహించి, పూర్తికి చర్యలు తీసుకోవాలని, లక్ష్యం మేరకు పనులు పూర్తికాని చోట బాధ్యులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, డీఆర్డీవో రాంరెడ్డి, జెడ్పి సిఇఓ రమాదేవి, జిల్లా వ్యవసాయ అధికారి నర్సింగం, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, ఇఇ పీఆర్ రఘువీరారెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ డిఇలు, ఏఇ లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement