Friday, November 22, 2024

కూచిపూడిలో సత్తా చాటిన ఏజెన్సీ బాలిక…

గంగారం – మహాబూబాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతమైన గంగారం మండలం కోమట్లగుడెం గ్రామానికి చెందిన సైప సురేష్,రేణుక దంపతుల కుమార్తె సత్య ధృవ కూచిపూడి నృత్యం లో ఉత్తమ ప్రతిభ చూపుతోంది. .రాష్ట్ర స్థాయి లో జరిగిన నృత్య ప్రదర్శన పోటీలలో పాల్గొని ఏకంగా 15 రాష్ట్ర స్థాయి అవార్డ్ లు సొంతం చేసుకుంది. ఏజెన్సీలో పుట్టి పెరిగిన ఈ బాలిక ప్రస్తుతం నర్సంపేట లో బిట్స్ స్కూల్ లో 6వ తరగతి అభ్యసిస్తుంది. చిన్న వయసులోనే కూచిపూడి నాట్యం పై ఆసక్తి చూపడంతో తల్లిదండ్రులు నాట్య గురువు పిండి సుభాషిణి దగ్గర చేర్పించారు.శిక్షణ పొందిన అనంతరం పలు సందర్బాలలో కూచిపూడి నాట్యం చేస్తూ పలువురి మన్ననలు,ప్రశంస లు పొందింది. మహా శివరాత్రి సందర్భంగా వరంగల్ జిల్లాలో భద్రకాళి ఆలయం లో గురువారం జరిగిన నృత్య ప్రదర్శనలో పాల్గొని అద్భుత నాట్య ప్రదర్శన కనబరిచి బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డ్ దక్కించుకుంది. తల్లిదండ్రులు,కుటుంబ సభ్యుల సహకారం తో మరెన్నో అవార్డులు గెలుచు కుంటానని సత్య ధృవ అంటుంది. చిన్న వయసులోనే ఇన్ని అవార్డ్ లు పొందడం తో తల్లిదండ్రులు , కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు హార్షం వ్య‌క్తం చేస్తున్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement