Sunday, November 10, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ కె. నిఖిల

జనగామ… నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆదివారం జరగనున్న పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. నిఖిల తెలిపారు.. శనివారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రంలోని బ్యాలెట్ పెట్టెలు, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ సామాగ్రి, పోలింగ్ విధుల సిబ్బంది హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె నిఖిల మాట్లాడుతూ ఆదివారం జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు జిల్లా వ్యాప్తంగా 21 వేల 213 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారన్నారు. జిల్లాలో 18 ప్రదేశాల్లో 31 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధులకు 11 మంది నోడల్ అధికారులు, 5 గురు సెక్టోరల్ అధికారులు, 36 మంది పివోలు, 36 మంది ఎపివోలు, 72 మంది ఓపివో లను నియమించామన్నారు. జిల్లాలో 5 రూట్లు, 5 జోన్లుగా విభజించి, ప్రతి పోలింగ్ కేంద్రంలో వీడియోగ్రఫీకి వీడియోగ్రాఫర్ ని నియమించామన్నారు. ఎన్నికల సిబ్బంది తమ తమ పోలింగ్ కేంద్రానికి సంబంధించి పోలింగ్ సామాగ్రిని జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలని, స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ సామాగ్రి ఉంటుందని ఆమె అన్నారు. ర్యాoడమైజేషన్ చేసి పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయించామన్నారు. పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించినట్లు, కోవిడ్ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, మాస్కులు, సానిటైజర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏ దశలోనూ అజాగ్రత్త పనికిరాదని, ఎన్నికల విధులు అత్యంత ముఖ్యమైనవని, ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా నిర్వర్తించాలని అన్నారు. విధుల నిర్వహణలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటించాలని కలెక్టర్ అన్నారు. ఓటు హక్కు పవిత్రమైనదని, ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) ఏ. భాస్కర్ రావు, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, తహసీల్దార్లు, ఎన్నికల విధుల సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement