Saturday, November 23, 2024

వెహికిల్స్ పై కొరడా ఝళిపించిన పోలీసులు

ట్రాఫిక్ నియమ, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వెహికిల్స్ పై వరంగల్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపించారు. మోటార్ వెహికిల్ యాక్ట్ కు విరుద్ధంగా నడుచుకోవడమే కాక, సౌండ్ పొల్యూషన్ కారణమయ్యే వాహనాలను గుర్తించి, డిటెన్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. వరంగల్ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ వడ్డే నరేష్ కుమార్ నేతృత్వంలో సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వరంగల్ మహా నగరంలో వాహనాలకు నెంబర్ ప్లేట్స్ లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ,ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తూ, ట్రాఫిక్ సమస్యకు కారణభూతమవుతున్న వెహికిల్స్ ను గుర్తించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అలాగే వెహికిల్స్ కు కంపెనీ నుండి వచ్చిన సైలెన్సర్స్ ను తొలగించి, హై సౌండ్ పొల్యూషన్  చేస్తున్న వాహనాలను నడుపుతూ ఎంవి యాక్ట్ కు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వాహనదారుల భరతం పట్టారు. అలాగే హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ వినియోగించకుండ నగరంలో సంచరించే వెహికిల్స్ తో పాటు, నంబర్ ప్లేట్స్ సరిగా కనిపించకుండ తిరుగుతున్న టూ వీలర్ వెహికిల్స్ ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మోటార్ వెహికిల్ యాక్ట్, ట్రాఫిక్ రూల్స్ ను ప్రతి ఒక్కరు పాటించాలని వరంగల్ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ వడ్డే నరేష్ కుమార్ కోరారు. నింబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంపెనీ నుండి సైలెన్సర్స్ మఫలర్స్ తొలగించిన, సౌండ్ పొల్యూషన్ సృష్టించే సైలెన్సర్ వాడిన కేసులు నమోదు చేస్తామని వరంగల్ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ వడ్డే నరేష్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డికి షాక్.. కాంగ్రెస్ కీలక నేత గుడ్ బై!

Advertisement

తాజా వార్తలు

Advertisement