(ప్రభన్యూస్ ప్రతినిధి హనుమకొండ). తెలంగాణ రాజముద్ర వివాదస్పమైంది.. ఓ ఫ్లెక్సీలో రాజముద్ర మార్చడం హాట్ టాపిక్ గా మారింది.. అనధికార లేఔట్ లు ప్లాట్లు క్రమబద్దీకరణ పై వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది .తెలంగాణ ప్రభుత్వం పేరిట ఫ్లెక్సీని ఆ డెస్క్ వద్ద కట్టారు. ఆ ఫ్లెక్సీలో ప్రభుత్వ రాజముద్ర మార్చడం వివాదస్పదంగా మారింది. మంగళవారం ఈ విషయమై కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు చేశారు . ప్రభుత్వం ఏర్పాటు చేసినఫ్లెక్సీలో కాకతీయ కళాతోరణం చార్మినార్ తో కూడిన అధికార ముద్రను ఉపయోగించలేదు. దానికి బదులు ప్రభుత్వం మార్చాలనుకుని భావిస్తున్న మరో రాజముద్ర ఫ్లెక్సీ పై ఉండడం పట్ల ఆందోళన కు దారి తెలిసింది. ప్రభుత్వ ఆమోదం తెలుపకుండానే ప్రతిపాదిత రాజ ముద్రను ఉపయోగించడంపై విమర్శలు వెళ్ళువెత్తాయి.. అందులో ప్రధానంగా కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు నగరంలో కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం మరింత అగ్గి రాజేసింది. ఓరుగల్లు ప్రజలు భగ్గుమన్నారు.
సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సందించారు. తెలంగాణ అస్తిత్వానికి చిహ్నమైన కాకతీయ కళాతోరణం చార్మినార్ లను తొలగించడంపై అగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేశారు అధికారికంగా ఏర్పాటు చేసిన ముద్రా.. లేదా అనే విషయంపై వివరణ కోరారు కొత్త చిహ్నం ఎవరు ఎప్పుడు ఆమోదించారంటూ ప్రశ్నలు సంధించారు. దీనితో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశాలతో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తమ తప్పును సరిదిద్దుకుంది. కాకతీయ కళాతోరణంతో కూడిన రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. బాధ్యులైన పట్టణ ప్రణాళిక విభాగం అధికారులకు షో కాస్ట్ నోటీసులను జారీ చేసింది.