వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావును కలిశారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమకు విధించిన లక్ష్యానికి మరికొద్ది బాయిల్డ్ రైస్ ఇవ్వాల్సి ఉందని, ఆ రైస్ ని త్వరలోనే ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో మిల్లర్ల నుండి రైస్ తీసుకుంటే, పౌరసరఫరాల కార్పొరేషన్ పై భారం తగ్గి, రైస్ సేకరణ వేగంగా పూర్తి అవుతుందని మంత్రులకు తెలిపారు. ఈ మేరకు ఒక విజ్ఞాపన పత్రాన్ని వారు మంత్రులకు సమర్పించారు. ఇందుకు మంత్రులు కూడా తమ సానుకూలతను వ్యక్తం చేశారు. మంత్రులను కలిసిన వారిలో తోట సంపత్ కుమార్, గోనెల రవిందర్, తక్కెళ్ళపల్లి యుగంధర్ తదితరులు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..