ఆంధ్రప్రభ ప్రతినిధి హనుమకొండ – హనుమకొండ జిల్లా మడికొండలో రాష్ట్ర ఆయిల్ ఫిల్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కుమార్తె డాక్టర్ నికితా రెడ్డి డాక్టర్ అవినాష్ రెడ్డిల వివాహం నేడు ఘనంగా జరిగింది
ఈ వివాహ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. నూతన దంపతులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
వారితో పాటు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొండ సురేఖ సీతక్క, కోమటి రెడ్డి వెంకట రెడ్డి తదితరులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.
అంతకుముందు ఈ వివాహ కార్యక్రమానికి హజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో మడికొండ చేరుకున్నారు. వరంగల్ హనుమకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద పి ప్రావీణ్యులు, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జా ప్రజా ప్రతినిధులు వారికి స్వాగతం పలికారు..