ప్రజలను మోసం చేస్తూ నకిలీ బంగారాన్న విక్రయిస్తూన్న ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ బంగారాన్ని విక్రయిస్తూ డబ్బును సంపాదిస్తున్న నిందితులను ఇంతేజా గంజ్ పోలీసులు అరెస్టు చేసారు. వారి నుండి 10 లక్షల 45వేల నగదుతో పాటు, ఐదు సెల్ ఫోన్లు, నకిలీ బంగారు గుండ్ల హారాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు మోహన్‌లాల్ వరమర్, సోలంకి ధర్మ, కర్ణాటకనికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. నిందితుల్లో ఒకడైన మోహన్‌లాల్ పాత బట్టలను కొనుగోలు వాటిని ఇతర రాష్ట్రాల్లో అమ్మేవాడని చెప్పారు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచన నకిలీ బంగారాన్ని అమ్ముతున్నారని చెప్పారు.