Friday, November 22, 2024

Warangal – మరి కొద్దిసేపటిలో వరంగల్ కు ప్రధాని మోడీ…రూ.6,100 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు

వరంగల్ కు మరి కొద్ది సేపటి లో ప్ర.ధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. రూ.6,100 కోట్ల విలువైన హైవే, రైల్వే ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చెయ్యబోతున్నారు. ఆయన టూర్ షెడ్యూల్ ప్రకారం.. ఉదయం ప్రధాని మోడీ.. వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తారు. అక్కడ హెలికాప్టర్ ఎక్కి.. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టులో దిగుతారు. తర్వాత భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో… కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారు. దీని అంచనా వ్యయం రూ.520 కోట్లు..

ఆ తర్వాత ప్రధాని మోదీ.. NH-163G, మంచిర్యాల – వరంగల్ విభాగంలో 4 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఇది మొత్తం 108 కిలోమీటర్ల రోడ్డు. దీని అంచనా వ్యయం రూ.3,440 కోట్లు. ఈ మూడు ప్రాజెక్టుల వల్ల పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగంగా సాగనుంది. అలాగే.. రహదారి, రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగవ్వనుంది. ఈ శంకుస్థాపనల తర్వాత ప్రధాని మోదీ.. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడతారు.

- Advertisement -

ప్రధాని మోదీ టూర్ సందర్భంగా.. 4 అంచెల భద్రతా చర్యలు తీసుకున్నారు. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో 144 సెక్షన్ అమలులో ఉంది. నేటి సాయంత్రం వరకూ ఈ సెక్షన్ అమలులో ఉంటుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement